మెగా ప్రిన్సెస్ కు స్వాగతం – చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

-

మెగా ఇంట సంబురాలు షురూ అయ్యాయి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ తెల్లవారుజామున 4 గంటలకు ఆడపిల్ల పుట్టినట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు అధికారికంగా తెలిపారు. తల్లీబిడ్డ ఇద్దరు క్షేమంగా.. ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మెడికల్ బులిటెన్ విడుదల చేశారు.

ఇక రామ్ చరణ్-ఉపాసన దంపతులు బిడ్డకు జన్మనివ్వడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం అంటూ ట్విట్ చేశారు. నీ రాకతో మెగా ఫ్యామిలీకి ఉత్సాహం తీసుకొచ్చావని పేర్కొన్నారు. తల్లిదండ్రులుగా రామ్ చరణ్-ఉపాసన, తాతగా తనకు సంతోషంగా, గర్వంగా ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news