లగచర్ల ఫార్మా భూసేకరణ పై వెనక్కి తగ్గింది రేవంత్ రెడ్డి సర్కార్. దీంతో లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి రోటిబండ తండా గ్రామాల రైతులకు ఊరట లభించింది. లగచర్లలో ఫార్మా కంపెనీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది ప్రభుత్వం. దీంతో పాటు లగచర్ల, హకీంపేట్ పోలేపల్లి గ్రామాల ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆ గ్రామాల్లో ఫార్మా కంపెనీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని.. ఇండస్ట్రీయల్ పార్క్ పేరుతొ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం.
ఇక ఫార్మా కాకుండా వేరే కంపెనీలు అయితే స్వచ్ఛందంగా భూములు ఇస్తాం అని ప్రజలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇండస్ట్రీయల్ పార్క్ లో టెక్స్ టైల్ కంపెనీ లకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం చూస్తుంది. టెక్స్ టైల్ కంపెనీలతో ఎక్కువ పొల్యూషన్ ఉండదు, స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయి అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక ఈ ఇండస్ట్రీయల్ పార్క్ పై రేపు నోటిఫికేషన్ జారీ చేయనుంది రేవంత్ సర్కార్.