జూన్ 20 లోపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడుతాయని ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్ ప్రకటించారు. ఇంటర్ ప్రధాన పరీక్షలు పూర్తి అయ్యాయని.. ఇంకా రెండు చిన్న పరీక్షలు మిగిలి ఉన్నాయి . 5 వేల లోపే విద్యార్థులు రాస్తారని చెప్పారు. ఈ సారి చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయని.. సిబ్బంది కష్టపడి పని చేశారని వెల్లడించారు.
నెల లోపే ఇంటర్ ఫలితాలు ప్రకటిస్తామని.. పొరపాట్ల ను వెంటనే సరిదిద్దామని వెల్లడించారు. వచ్చే పరీక్షల్లో మిస్టేక్స్ లేకుండా చూస్తామని.. తెలుగు, ఇంగ్లీష్ మీడియం లలో వేర్వేరు ప్రశ్నలు వచ్చిన చోట ఏ ప్రశ్నకు ఆన్సర్ రాసిన పరిగణన లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 15 కేంద్రాల్లో పేపర్ వాల్యూయేషన్ జరుగుతుందని.. 15 వేల మంది పేపర్ వాల్యూయేషన్ లో పాల్గొంటున్నారన్నారు. జూన్ 20 లోపు ఇంటర్ ఫలితాలు ప్రకటించేందుకు సన్నద్ధం అవుతున్నామని ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్ ప్రకటించారు.