తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ న్యూస్..రాష్ట్రంలో ఇటీవల జరిగిన టెన్త్, ఇంటర్ పరీక్షలకు సంభందించిన పేపర్ కరెక్షన్ వేగంగా కొనసాగుతోంది..ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్ దాదాపు పూర్తయినట్టేనని అధికార వర్గాలు అంటున్నాయి.
అయితే, ఈ నెల 20లోగా ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డ్ అంటుంది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూలై మొదటి వారంలో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ నెల 11 నాటికి టెన్త్ మూల్యాంకన ప్రక్రియ పూర్తవుతుందని తెలిసింది. ఈ నేపథ్యంలో టెన్త్ ఫలితాలను ఈ నెల 30లోగా వెల్లడిస్తామని సంభంధిత బోర్డ్ అధికారులు స్పష్టం చేశారు.
టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేశారు. రెండేళ్ల తర్వాత టెన్త్ పరీక్షలు జరగడంతో ఈసారి 11 ప్రశ్నపత్రాలకు బదులు 6 మాత్రమే ఇచ్చారు. పరీక్షల సమయాన్ని పెంచారు. అంతే కాదు ఇంటర్, టెన్త్‌కు 70 శాతం సిలబస్ మాత్రమే ఇచ్చారు. ఈ మేరకు పరీక్షా ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇకమీదట నుంచి యదావిధిగా సిలబస్ ను కొనసాగిస్తున్నారు.