లాక్ డౌన్ విషయంలో తెలంగాణా మొత్తం సపోర్ట్ కేసీఆర్ కే….

-

ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయి అని తెలిసినా సరే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ విషయంలో వెనక్కు తగ్గలేదు. కేంద్రం కంటే ముందే ఆయన లాక్ డౌన్ ని పెంచే నిర్ణయం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల వారిని కూడా రావొద్దు అని స్పష్టంగా చెప్పేశారు. దీనికి ఇప్పుడు తెలంగాణా ప్రజల పూర్తి స్థాయి మద్దతు ఉందని అంటున్నారు. తాజాగా ఒక సర్వే నిర్వహించగా అందరూ జై కొడుతున్నారు.

84.8 శాతం మంది కరోనా కఠిన సమయంలో కేసేఆర్ పనితీరు అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. 14 శాతం మంది పర్లేదని, 1.2 శాతం మంది అసలు బాగోలేదని తమ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పనితీరు గురించి అడగగా… 66.4 శాతం మంది చాలా బాగుందని చెప్పారు. 27.2 శాతం మంది బాగుందన్నారు. 5.8 శాతం మంది పర్లేదని అభిప్రాయపడ్డారు. కేవలం 0.6 శాతం మంది మాత్రమే బాగా లేదని చెప్పారు.

ఇక కేంద్రం విషయానికి వస్తే కరోనా కట్టడిలో 60.1 శాతం మంది కేంద్రం పనితీరు చాలా బాగుందని ప్రశంసించారు. 24.6 శాతం మంది బాగుందని చెప్పారు. 11.9 శాతం మంది పర్లేదు అని చెప్పారు. 3.4 శాతం మంది బాగా లేదని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని 76.2 శాతం మంది అభినందించారు. లాక్ డౌన్ కోసం ఆయన మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అభినందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news