ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మరో ఛాన్స్ ఇచ్చిన TSLPRB

-

పోలీసు ఉద్యోగాల కోసం నిర్వహించిన దేహదారుడ్య పరీక్షల్లో 1సెం.మీ తక్కువ ఎత్తుతో అనర్హత పొందిన వాళ్లకు పోలీస్ నియామక మండలి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ అభ్యర్థులకు మరో ఛాన్స్ ఇస్తున్నట్టు ప్రకటించింది. హైకోర్టు ఆదేశాలతో ఆయా అభ్యర్థులకు తిరిగి మరోసారి ఎత్తును కొలవాలని  నిర్ణయించింది.

ఈ మేరకు హైదరాబాద్​లోని అంబర్ పేట సీపీఎల్ మైదానం, కొండాపూర్​లోని 8వ పోలీస్ బెటాలియన్ మైదానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు పోలీస్ నియామక మండలి వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవాలని కోర్టు సూచించింది. ఆన్​లైన్​ చేసిన పత్రాలను డౌన్​లోడ్ చేసుకొవాలని  సూచించింది.

తిరిగి ఎత్తు కొలిచే ప్రక్రియలో అభ్యర్థులు దరఖాస్తు పత్రాలను తీసుకురావాలని అధికారులు సూచించారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పోలీస్ నియామక మండలి దేహదారుడ్య పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news