పుణ్య క్షేత్రాలకు వెళ్లే వారికి తెలంగాణ RTC మరో శుభవార్త

తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26న పలు జిల్లాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం మొత్తం 18 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు.

నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి 21 బస్సులు, జేబీఎస్ నుంచి 12, నిజామాబాద్ నుంచి 45, హనుమకొండ నుంచి 5, కరీంనగర్ నుంచి 4, జగిత్యాల నుంచి 1 బస్సును నడపనున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లాలోని వర్గల్ సరస్వతి ఆలయానికి సికింద్రాబాద్ గురుద్వారా నుంచి ప్రతి అరగంటకో బస్సు నడిచే విధంగా ఏర్పాటు చేసినట్లు టిఎస్ఆర్టిసి అధికారులు వెల్లడించారు. దీని పూర్తి వివరాల కోసం… తెలంగాణ ఆర్టీసీ వెబ్‌ సైట్‌ ను సంప్రదించాలని కోరారు.