తెలంగాణను భారీ వర్షాలు అస్సలు వదలడం లేదు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో వరుణుడు భీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్ నగరం జలవిలయంతో చిగురుటాకుల వనికిపోతుంది. మరోసారి తెలంగాణకు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. నైరుతి రుతుపవరాల తిరోగమనం ప్రారంభం కావడంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. మరో వారం, పది రోజుల్లో తెలంగాణ నుంచి ఋతుపవనాలు పూర్తిగా నిష్క్రమిస్తాయని తెలిపారు. ఈనెల 18న ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అన్నారు.