తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. నిన్నటి తీవ్ర అల్పపీడనం ఈ రోజు దక్షిణ ఛత్తీస్ ఘడ్ & పరిసర దక్షిణ ఒడిస్సా ప్రాంతాలలో కేంద్రీకృతమైందని.. అల్పపీడనం కి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుండి 7.6 కిమీ వరకు కేంద్రీకృతమై ఎత్తుకు వెళ్ళే కొలదీ నైరుతి దిశ వైపుకి వంపు తిరిగి స్థిరంగా కొనసాగుతూ ఉందని వెల్లడించింది.

ఇక అటు హైదరాబాద్‌ మహా నగరంలో దంచికొడుతోంది వర్షం. నిన్న సాయంత్రం 6 తర్వాత వర్షం ప్రారంభం అయింది. రాత్రింతా భారీ వర్షం కురిసింది. తాజాగా హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపిన నివేదిక ప్రకారం.. జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. చందానగర్-4.3 సెం.మీ., అత్తాపూర్-2.3 సెం.మీ, మియాపూర్-1.2 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news