ప్రభుత్వం మారడంతో హైదరాబాద్‌లో జరగవలసిన ఫార్ములా-ఈ రేస్ రద్దు!

-

హైదరాబాద్ మహానగరంలో జరగవలసిన ఫార్ములా ఈ రేస్ రద్దయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 64 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వం మారడంతో… హైదరాబాదులో జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ రద్దు అయినట్లు సమాచారం అందుతుంది.

the formula-e race to be held in Hyderabad has been cancelled

గత సంవత్సరం హైదరాబాద్ నగరంలో ఫార్ములా-ఈ స్ట్రీట్ రేస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగవలసిన రేస్ రద్దయినట్లు సమాచారం. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ రావడంతో రేస్ నిర్వహించడం కష్టం అని నిర్వాహకులు తేల్చినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version