మంత్రి మల్లారెడ్డి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు

-

ఈరోజు ఉదయం నుండి మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పలు బృందాలుగా విడిపోయిన అధికారులు మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇల్లు, వ్యాపార సముదాయాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

కొంపల్లి లోని ఫామ్ మెడోస్ విల్లాలో సోదాలు చేపట్టారు. దాదాపు 50 బృందాలు ఏకకాలంలో ఈ తనిఖీలలో పాల్గొన్నాయి. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ సీట్ల భర్తీపై అనేక ఆరోపణలు వచ్చాయి. కన్వీనర్ కోటకి బదులు ప్రైవేట్ వ్యక్తులకు మల్లారెడ్డి కాలేజ్ యాజమాన్యం కోట్లకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో మొత్తం నాలుగు మల్లారెడ్డి మెడికల్ కాలేజీల బ్యాంకు లావాదేవీలను ఐటి అధికారులు పరిశీలిస్తున్నారు.

వారి పరిశీలనలో మెడికల్ కాలేజ్ లావాదేవీలలో భారీవ్యత్యాసాలు బయటపడ్డట్టు సమాచారం. ఇక ఎట్టకేలకు మంత్రి మల్లారెడ్డి సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు ఐటి అధికారులు. తన నివాసం పక్క క్వార్టర్స్ లో జూట్ బ్యాగులో మల్లారెడ్డి సిబ్బంది సెల్ ఫోన్ ని దాచగా.. ఐటి అధికారులు గుర్తించి స్వాధీన పరుచుకున్నారు. సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో ఎలాంటి కీలక సమాచారం ఐటి అధికారులు సేకరిస్తారని ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news