యాదవులకు కేసీఆర్ సర్కార్ తీపికబురు చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ లో రెండో విడత గొర్రెల పంపిణీ నీ చేపడతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పశుసంవర్ధక శాఖ పద్దుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘ఉమ్మడి ఏపీలో పశుసంవర్ధక శాఖకు పెద్దగా బడ్జెట్ ఉండేది కాదు. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఈ శాఖకు ప్రాధాన్యమిచ్చి ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మందికి భరోసా కల్పించారు’ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు అయిన నాటి నుంచి 14 చేక్ డ్యామ్ లను మంజూరు చేశామని మంత్రి హరీష్ రావు తెలిపారు. సభ్యుల ప్రశ్నకు సమాధానం ఇస్తూ, మంజూరు చేసిన వాటిలో 860 చెక్ డ్యాములను చేపట్టామని, వాటిలో 303 పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన వాటిలో 548 పూర్తయ్య దశలో, 9 ప్రారంభ దశలో ఉన్నాయని తెలిపారు.