ఇక పై ప్రైవేటులోనూ ఉచితమే… తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…!

-

తెలంగాణ రాష్ట్రం లో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతోంది. ఈనేపథ్యంలో మొదటగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందించారు. ఆ తర్వాత కేసులు పెరిగేకొద్దీ పరీక్షలు చేయించుకోవాలనే వారి సంఖ్య అమాంతం పెరగడంతో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా పరీక్షలు, చికిత్స చేయడానికి అనుమతిని ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీంతో అనేకమంది ప్రైవేట్ ఆస్పత్రుల వైపు కూడా పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించే కరోనా నిర్ధారణ పరీక్షలు, కరోనా చికిత్సకు అయ్యే బిల్లుల పట్ల అనేక విమర్శలు ప్రభుత్వం ఎదుర్కొంది.

K_Chandrasekhar_
K_Chandrasekhar_

ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ సర్కార్… తాజాగా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రిలోను కరోనా కు సంబంధించి పరీక్షలు, చికిత్స ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక ఇందులో భాగంగానే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉచితంగా పరీక్షలు, వైద్యం అందించాలని సీఎం కేసీఆర్ ప్రకటన జారీ చేశారు. ఈ నేపథ్యంలో కేవలం మూడు ప్రైవేట్ కాలేజీ లను మాత్రమే ఎంపిక చేశారు. కరోనా పరీక్షలు హైదరాబాదులోని కామినేని మెడికల్ కాలేజ్, మమత మెడికల్ కాలేజ్, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ లలో ఉచితంగా పరీక్షలు, చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే ఇందుకు సంబంధించి పూర్తి విధివిధానాలను ఇంకా ప్రకటించలేదు. ప్రకటించిన అనంతరం ఉచిత సేవలను ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు విస్తరించే అవకాశం ఉందని అర్థమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news