ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. సిట్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ దుశాంత్ వాదనలు వినిపిస్తున్నారు. నిందితుల తరఫున మహేష్ జట్మలాని వాదనలు వినిపిస్తున్నారు. అయితే సిటిపై తమకు నమ్మకం లేదని, సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని మహేష్ కోరారు. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు కేసులు పెట్టారని, కేసుతో సంబంధం లేని వారిని ఎఫ్ఐఆర్ జాబితాలో చేర్చారని మహేష్ వాదనలు వినిపించారు.
డివిజన్ బెంచ్ ఆదేశాలు చాలా క్లియర్ గా ఉన్న సిబిఐతో విచారణ జరిపించాలని కోరడం సమంజసం కాదని సిట్ తరపు న్యాయవాది దుష్యంత్ చెప్పారు. రియా చక్రవర్తి కేసును సైతం ఆయన ప్రస్తావించారు. సిట్ దర్యాప్తు సరిగా జరగడం లేదన్న వాదనను ఆయన తోసిపిచ్చారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని, నిందితులతో సంబంధం లేదంటూనే వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని వాదించారు. ఈ కేసులో వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి.