మునుగోడు ఉపఎన్నికల కోసం జరిగే కొత్త ఓటర్స్ నమోదులో టిఆర్ఎస్ నకిలీ ఓట్లని సృష్టించే అవకాశం ఉందని ఆరోపించారు మాజీ ఎంపీ, మునుగోడు బిజెపి స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి. మునుగోడులో విశృతంగా పనిచేయాలని సునీల్ బన్సల్ సూచించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నేతలందరూ గ్రామాలకు వెళ్లాలని.. దసరా అనంతరం 7వ తేదీ నుంచి మునుగోడులో బైక్ ర్యాలీలో ఉంటాయన్నారు.
ఈ బైక్ ర్యాలీల ద్వారా మునుగోడులో ఈ ఉపఎన్నిక ఎందుకు వచ్చిందనే దానిపై ప్రజలకు వివరిస్తామన్నారు. బిజెపి నాయకుల మీద అనవసరంగా పెడుతున్న అక్రమ కేసుల మీద కమిటీని ఏర్పాటు చేయాలని సునీల్ బన్సల్ సూచించినట్లు తెలిపారు. ఈనెల 10వ తేదీన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తరున్ చుగ్ మునుగోడు కి వస్తారని పేర్కొన్నారు. మునుగోడులో వారు బూత్ కమిటీ నేతలతో సమావేశం నిర్వహిస్తారని అన్నారు.