మహిళలకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా ధరలు పైపైకి వెళ్లాయి. బుధవారం ధరలు కాస్త పెరగగా, ఇవాళ మరోసారి స్వల్పంగా దిగివచ్చింది.

10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం పై రూ. 500 తగ్గగా, 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంపై కూడా రూ. 530 దిగి వచ్చింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50, 200 గా నమోదయింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46, 000 గా నమోదయింది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం భారీగా తగ్గి పోయాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 1000 తగ్గి రూ. 61,500 గా నమోదు అయింది.