కొడంగ‌ల్ లో ఇవాళ రూ. 75.45 కోట్ల‌తో అభివృద్ధి పనులకు శ్రీకారం !

-

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం కొడంగ‌ల్ లో రూ. 75.45 కోట్ల‌తో చేప‌ట్ట‌నున్న‌ ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఇవాళ‌ మంత్రులు జూప‌ల్లి కృష్ణారావు, శ్రీధ‌ర్ బాబు, దామోద‌ర్ రాజ‌న‌ర్సింహా శంకుస్థాప‌న, ప్రారంభోత్స‌వాలు చేయ‌నున్నారు. ఇందులో భాగంగానే… ఉద‌యం 11 గంట‌ల‌కు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి బ‌య‌లుదేరి కొడంగ‌ల్ చేరుకుంటారు. స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో హరే రామ హరే కృష్ణ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోని
విద్యార్థులకు అల్పాహారం అందించే కిచెన్ షెడ్డు ప్రారంభోత్స‌వం ఉంటుంది.

kodangal-revant

రూ.19.68 కోట్ల‌తో కొడంగల్, కోస్గి మున్సిపాలిటీల ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దీంతో పాటు వర్చువల్ గా ఒకే దగ్గరి నుంచి నూతన మండలాలైన కొత్తపల్లి, దుద్యాల, గుండుమాల్ మండలాల్లో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ (26.4 కోట్ల వ్య‌యం) నిర్మాణాలకు శంకుస్థాపన ఉంటుంది. నియోజకవర్గంలో రూ.5 కోట్ల‌తో 25 కొత్త అంగన్వాడీ కేంద్రాల‌కు శంకుస్థాప‌న‌ చేస్తారు. రూ. 24.37 కోట్ల వ్యయంతో పాఠశాలల అదనపు తరగతి గదులు, మ‌హిళ స‌మాఖ్య భ‌వ‌నాలు, పీఏసీఎస్ బిల్డింగ్స్, పాఠ‌శాల‌ల కాంపౌండ్ వాల్స్ నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version