ఇవాళ్టి కేసీఆర్ జమ్మికుంట బస్సు యాత్ర రోడ్డు షో రద్దు

-

ఇవాళ్టి కేసీఆర్ జమ్మికుంట బస్సు యాత్ర రోడ్డు షో రద్దు ఐంది. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ 48 గంటలు నిషేధం విధించిన కారణంగా.. షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన ఇవాళ్టి (02.05.24) జమ్మికుంట బస్సు యాత్రను రోడ్డు షోను రద్దు చేసుకుని ఎర్రవెల్లి నివాసానికి బయలుదేరారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

48 గంటలు నా ప్రచారాన్ని నిషేదిస్తే..96 గంటలు కార్యకర్తలు పని చేస్తారన్నారు KCR. మహబూబాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ…కేసీఆర్ 48 గంటలు ప్రచారం చేయొద్దని ఎన్నికల కమీషన్ నిషేధం విధించింది. కానీ రేవంత్ రెడ్డి నా పేగులు మెడల వేసుకుంటా.. గుడ్లు పీకుతా అన్న కూడా అతన్ని నిషేధించలేదన్నారు. 48 గంటలు నా ప్రచారాన్ని నిషేదిస్తే.. 96 గంటలు అవిశ్రాంతంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పని చేస్తారని వివరించారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version