సామాన్యులకు బిగ్‌ షాక్‌..రూ.100లకు చేరిన టామాటో ధరలు

-

Tomato prices hit century mark in AP and Telangana states: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు షాక్‌. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో టమోటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో టమోటా ధరలు సెంచరీ కొట్టాయి. ఇక టమాటా ధరలు ఆకాశాన్ని అందడంతో సామాన్య ప్రజలు కొనాలంటేనే భయపడిపోతున్నారు. మొన్నటిదాకా కిలో రూ. 50 ఉండగా… తాజాగా మార్కెట్లో రికార్డు స్థాయిలో రూ. 100కి చేరింది.

Tomato prices hit century mark in AP and Telangana states

ముఖ్యంగా మదనపల్లి టమోటా మార్కెట్లో ఒక్కసారిగా పెరిగాయి టమోటా ధరలు. కేజీ 80 రూపాయలకు చేరుకుంది టమోటా ధర. రిటైల్ మార్కెట్లో 100 రూపాయలు దాటింది కేజీ టమోటా ధర. పంట దిగుబడి లేకపోవడమే టమోటా ధరల పెరుగుదలకు కారణం అంటున్నారు రైతులు. దీనిపై వెంటనే ఏపీ సర్కార్‌ చర్యలు తీసుకోవాలని జగన్‌ మోహన్ రెడ్డి పార్టీ కోరు తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version