హైదరాబాద్‌ లో బోనాల సందడి..ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

-

హైదరాబాద్ పాతబస్తీలో బోనాల సందడి మొదలైంది.లాల్ దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.అర్ధరాత్రి నుంచే ఆలయం దగ్గర కోలాహలం కనిపిస్తోంది.తెల్లవారుజామునుంచే సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

ఇందులో భాగంగానే లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి ఆనవాయితీగా మొదటి బోనం సమర్పించారు దేవేందర్ గౌడ్ కుమారుడు, కోడలు. పాత బస్తి లాల్ దర్వాజ బోనాలకు పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు అధికారులు. లాల్ దర్వాజ పరిసర ప్రాంతల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.

ఇక అటు ఆషాడ మాసం బోనాల పండుగ సందర్భంగా( ఆదివారం) తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్ కు ప్రతీకగా నిలుస్తాయని సీఎం అన్నారు. ఎడతెరిపి వానలు, వరదల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.

Read more RELATED
Recommended to you

Latest news