చెన్నూరులో త్రిముఖ పోరు..సుమన్‌కు చెక్?

-

చెన్నూరు నియోజకవర్గం ఉమ్మడి ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా ఉన్న స్థానాల్లో చెన్నూరు ఒకటి. ఇక్కడ మొదట్లో కాంగ్రెస్, టి‌డి‌పి మంచి విజయాలు సాధించాయి. 1983 వరకు కాంగ్రెస్ వరుసగా విజయాలు సాధించగా, ఆ తర్వాత నుంచి టి‌డి‌పి విజయాలు సాధిస్తూ వచ్చింది. 1985, 1989,1994, 1999 ఎన్నికల్లో వరుసగా టి‌డి‌పి గెలిచింది. ఇక 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2009లో బి‌ఆర్‌ఎస్ పార్టీ తొలిసారి చెన్నూరులో విజయం సాధించింది. 2010 ఉపఎన్నికలో సైతం కారు పార్టీదే హవా.

ఇక 2014, 2018 ఎన్నికల్లో కారు హవా నడిచింది. వరుసగా మూడుసార్లు నల్లాల ఓదెలు బి‌ఆర్‌ఎస్ పార్టీ తరుపున విజయం సాధించారు. కానీ 2018 ఎన్నికల్లో ఓదెలుకు సీటు దక్కలేదు. బాల్క సుమన్‌కు సీటు దక్కింది. ఆయన కాంగ్రెస్ పార్టీపై విజయం సాధించారు. అయితే ఈ సారి ఎన్నికల్లో కూడా బి‌ఆర్‌ఎస్ పార్టీ నుంచి సుమన్ మళ్ళీ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఓదెలు ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చేశారు. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయిన వెంకటేష్ నేత బి‌ఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. ఆయనకు రాజ్యసభ పదవి కూడా వచ్చింది.

దీంతో చెన్నూరులో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం కనిపించడం లేదు. ఇదే సమయంలో ఇక్కడ బి‌జే‌పి తరుపున మాజీ ఎంపీ వివేక్ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో చెన్నూరులో బి‌జే‌పికి 2 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. వివేక్ పోటీ చేస్తే కాస్త బి‌జే‌పి రేసులోకి రావచ్చు. దీంతో చెన్నూరులో త్రిముఖ పోరు జరిగే ఛాన్స్ ఉంది. ఈ పోరులో ఓట్లు చీలితే సుమన్‌కు ప్లస్ అవుతుంది. అంటే మళ్ళీ సుమన్‌కు చెక్ పెట్టడం కష్టమే అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news