టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీల పట్ల వివక్ష చూపుతోంది: బండి సంజయ్

-

టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీల పట్ల వివక్ష చూపిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్​కుమార్ ధ్వజమెత్తారు. ఆదివాసీలు సాగు చేసుకునే పోడు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్యాంక్​బండ్​పై గల కుమురం భీం విగ్రహానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుతో కలిసి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 12 శాతం రిజర్వేషన్లు అంశంపై కేంద్రానికి లేఖ పంపించాలని బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్రాన్ని తాము ఒప్పిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కుమురం భీం ఆశయాలకు అనుగుణంగా తమ పార్టీ పని చేస్తోందని తెలిపారు.

bandi sanjay
bandi sanjay

ఆదివాసీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళితే పట్టించుకోవడం లేదని ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు. రాష్ట్రంలో ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములను ఆదివాసీలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3పై ప్రభుత్వం సుప్రీంకోర్టులో సరిగా వాదించలేదని ఆయన ఆక్షేపించారు.

Read more RELATED
Recommended to you

Latest news