షర్మిలని టార్గెట్ చేసిన టీఆర్ఎస్..ఇంకా హైలైట్.!

-

పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి..టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుని తీవ్ర స్థాయిలో తప్పుబడుతూ..కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలుని టీఆర్ఎస్ శ్రేణులు టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. ఇంతకాలం షర్మిల ఎన్ని విమర్శలు చేసిన పెద్దగా స్పందించలేదు. అయితే ఇటీవల షర్మిల..ఏ నియోజకవర్గంలోకి అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో విమరాలు చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఇక యథావిధిగా కేసీఆర్‌పై విరుచుకుపడుతున్నారు.

అయితే తాజాగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడున్న టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఏకంగా షర్మిల పాదయాత్రని టార్గెట్ చేశారు. షర్మిల కేరవాన్‌కు నిప్పు పెట్టారు. అలాగే పాదయాత్రపై రాళ్ళు రువ్వారు. షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక వారికి ధీటుగా వైఎస్సార్టీపీ శ్రేణులు కూడా స్పందించాయి.  కేసీఆర్‌కు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఉద్రిక్తత పరిస్తితులు నెలకొన్న నేపథ్యంలో పాదయాత్రలో పోలీసులు భారీగా మోహరించారు..అటు టీఆర్ఎస్, ఇటు వైటీపీ కార్యకర్తలని అదుపులోకి తీసుకున్నారు. ఇక షర్మిలని అదుపులోకి తీసుకుంటారని సమాచారం. అయితే షర్మిల ఏ నియోజకవర్గంలోకి వెళితే అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యేని గాని, మంత్రిని గాని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఆ మధ్య మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లని, కరీంనగర్ జిల్లాలో గంగుల కమలాకర్, జీవన్ రెడ్డి లాంటి వారిపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు కూడా చేశారు.

అయితే ఆమెకు పూర్తిగా స్థాయిలో టీఆర్ఎస్ నుంచి కౌంటర్లు రాలేదు..కానీ ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. ఇక ఇలా షర్మిలని టార్గెట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆమె కూడా హైలైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంతకాలం అంతగా హైలైట్ కాలేదు. ఈ సారి షర్మిల రాజకీయం మారిపోయే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news