సార్వత్రిక ఎన్నికల వేళ టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం

-

సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13వ తేదీన ఎన్నికలు ఉండటంతో ఓటర్లను స్వస్థలాలకు తీసుకువెళ్లడం తమ భాద్యత అంటున్నాయ్‌ ఆర్టీసీలు. ఏపీలో ఓటున్న హైదరాబాద్ నగరవాసులు వెళ్లేందుకు సరిపడా బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు రంగారెడ్డి రీజియన్‌ మేనేజర్‌ బి.రాజు తెలిపారు.

ఈ నెల 9వ తేదీ నుంచే ఏపీకి రద్దీ ఉంటుందని, శని, ఆదివారాల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని రాజు అన్నారు. ఆ రెండు రోజులు సెలవుదినాలు కావడంతో సిటీ బస్సులను దూర ప్రాంతాలకు వెళ్లేలా సర్దుబాటు చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో పల్లెల్లో ఓట్లున్న వారు ఎన్నికల రోజు అక్కడికి వెళ్లేందుకు తెల్లవారుజాము నుంచి.. తిరిగి వచ్చేందుకు అర్ధరాత్రి వరకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ప్రకటించారు. ఇరు రాష్ట్రాల రవాణా సంస్థలు కలిపి రోజువారీ బస్సులకు అదనంగా 2 వేల వరకూ నడుపుతున్నామని వివరించారు. టీఎస్‌ఆర్టీసీ రోజూ నడిచే 3,450 బస్సులకు అదనంగా 1000కిపైగా బస్సులను సిద్ధంగా ఉంచుతోంది. 200 బస్సుల్లో రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తున్నామని ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version