విజయశాంతి ప్రకటన వెనుక అసలు ఆంతర్యం ఇదే…!

-

విజయశాంతి ప్రకటన వెనుక అంతర్యం ఏంటి.. తెలంగాణలో కాంగ్రెస్ బలహీన పడింది… బీజేపీ కి బలం చేకూరుతుంది అనేనా.. ఓన్లీ కామెంట్ కె పరిమితం అయ్యారా…లేదంటే భవిష్యత్ రాజకీయాన్ని స్పష్టం చేయదలుచుకున్నారా.. అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ లో విజయశాంతి అసంతృప్తి తో ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తు వచ్చారు. వచ్చిందే అదునుగా… కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి విజయశాంతి ఇంటికి వెళ్లి… పార్టీలోకి ఆహ్వానించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు మొదట పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ రాములమ్మ ఇంటికి వెళ్లారు. ఇటీవల ఇంఛార్జి ఠాగూర్ కూడా రాములమ్మ ఇంటికీ వెళ్లి బుజ్జగించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఠాగూర్ ఇంఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గాంధీ భవన్ కి వచ్చినా… రాములమ్మ రాలేదు. కానీ ఠాగూర్ మాత్రం విజయశాంతి ఇంటికి వెళ్లి బుజ్జగించారు. ఠాగూర్ ఓ మెట్టుదిగి వెళ్లినా…రాములమ్మ డిసైడ్ అయినట్టు… ఠాగూర్ రాక ఆలస్యం అయ్యిందని ప్రకటన చేశారు.

ఇప్పటికే విజయశాంతి కూడా ఓ నిర్ణయానికి వచ్చేశారా..అనేలా ఉంది పరిస్థితి. అప్పటి వరకు ఎలాంటి ఆలోచనలో ఉన్నారో తెలియదు కాని… విజయశాంతి ఓ ప్రకటనలో బీజేపీ…కాంగ్రేస్ ఇంఛార్జి ఠాగూర్ ప్రస్తావన ఉండటంతో రాములమ్మ ఏ రాజకీయ వేదిక పంచుకోబోతున్నారు అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. కేసీఆర్ కాంగ్రెస్ నేతలు కొందరిని ప్రలోభపెట్టి… ఇంకొందరిని భయపెట్టి… ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారు అంటూనే…కాంగ్రెస్‌ను బలహీనపరిచే ప్రక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చింది అంటూ విజయశాంతి పత్రిక ప్రకటన చేశారు.

ఇంత వరకు కొంత క్లారిటీగానే ఉన్నా..ఠాగూర్ కొంత ముందుగా రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేది అంటూ కామెంట్ చేశారు. అయితే విజయశాంతి తాను తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకున్నా అని చెప్పదలుచుకున్నారా..? ఆలస్యంగా ఠాగూర్ మంతనాలు చేశారు.. అనుకున్నారో ఏమో కాని… విజయశాంతి ఇక బీజేపీ లో చేరటం ఖాయం అయినట్టు ప్రచారం జరిగింది. ఈ నెలాఖరులో రాములమ్మ రాజకీయ భవిష్యత్ డిసైడ్ చేసుకోబోతున్నారు అనే ప్రచారం ఊపందుకుంది. అయితే విజయశాంతి బీజేపీ లో చేరితే రాజ్యసభ కి రాములమ్మ ను పంపనుంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. విజయశాంతి సినీ గ్లామర్ ని తమిళనాడు పాలిటిక్స్ లో కూడా వాడుకోవాలన్నది కమలం పార్టీ ప్లాన్ గా తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news