మునుగోడు ఎన్నిక తర్వాత బిజెపిలో ఎవరూ చేయడం లేదు ఇతర పార్టీల నేతలు అంటూ వస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంపై విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గారు అనేక దుర్మార్గపూరిత ప్రత్యర్థుల వ్యూహాలతో ఎన్నికల విజయం అందుకోవడంలో కొంచెం దూరం కావడం వల్ల బీజేపీలోకి చేరికలు ఆగిపోయాయని బీజేపీ వ్యతిరేకులు అనడం అసమంజసం అన్నారు.
ఇప్పటికీ బీజేపీ లో చేరికలు జరుగుతునే ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికల విజయం, హుజురాబాద్ ఎన్నికల విజయాల అనంతరం కూడా బీజేపీలోకి చేరికలు జరిగినప్పటికీప్రభుత్వ నియంత్రిత ప్రసారసాధనాలలో అవి ఎక్కువగా కనపడకపోవచ్చు. అదే విధంగా, మునుగోడు ఉపఎన్నిక తర్వాత జరిగిన అనేక చేరికలు ప్రచారంలో పెద్దగా ప్రాధాన్యతను సంతరించుకోనప్పటికీ, ఆ చేరికల్లో ఏ ఒక్కటీ తక్కువ కాదు. ప్రతి కార్యకర్త చేరికా బీజేపీకి అత్యంత గౌరవనీయమైనదేనని పేర్కొన్నారు విజయశాంతి.