అవినీతికి కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆర్ గారే – విజయశాంతి

అవినీతికి కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆర్ గారేనని ఆరోపణలు చేశారు బీజేపీ నేత విజయశాంతి. బీఆరెస్‌ను కనీసం పక్క రాష్ట్రాల్లో కూడా ఇంత వరకూ ఎవరూ పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ, ఈ లిక్కర్ కేసు ద్వారా మొత్తం భారతదేశం బీఆరెస్, కేసీఆర్ గురించి తెలుసుకుందని ఫైర్‌ అయ్యారు. అంతేగాక, అన్నా హజారే స్ఫూర్తితో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా లంచాల బురద ఇమేజిని తెప్పించింది ఈ బీఆరెస్, కేసిఆర్ & కో అని ఫైర్‌ అయ్యారు.

పైగా ఈ స్కామ్ నుంచి జనం దృష్టిని మళ్లించడానికే అన్నట్టు…. గతంలో కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టినప్పుడు, ఆ పార్టీతో కేంద్రంలో అధికారాన్ని పంచుకున్నప్పుడు, చివరికి తెలంగాణలోనే గత 8 ఏళ్ళకు పైగా అధికారంలో ఉంటున్నప్పటికీ కనీసం గుర్తుకురాని మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని ఇప్పుడు బీఆరెస్ ఎత్తుకుందంటేనే ఈ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ గారి కుట్రపూరిత నైజమేంటో ఇట్టే గ్రహించవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అవినీతికి కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆర్ గారే… ఏది ఏమైనా ఈ రోజు దేశంలోని అవినీతి పార్టీలన్నీ బీజేపీ లక్ష్యంగా చేస్తున్న దాడి ద్వారా… దేశంలోని అవినీతి నేతల యొక్క అద్భుత ఐక్యత ప్రజలందరికీ అర్థమవుతోంది. ఎప్పటికైనా ధర్మం జయిస్తుందని తెలిపారు విజయశాంతి.