మాట మార్చడం, మడమ తిప్పడం కేసీఆర్ అలవాటే – విజయశాంతి

-

మాట మార్చడం, మడమ తిప్పడం కేసీఆర్ అలవాటేనని విమర్శలు చేశారు విజయశాంతి. కేసీఆర్ గారికి ఎన్నికల ముందోమాట ఎన్నికల తర్వాతో మాట పరిపాటిగా మారిపోయింది. హుజురాబాద్ ఎన్నికలప్పుడు ఆగమేఘాల మీద దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎన్నికల తర్వాత దాన్ని పట్టించుకోవడం లేదు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో గొర్రెల పంపిణీకి నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.

 

 

మునుగోడు ఉప ఎన్నికతో పాటే గొర్రెల పంపిణీకి నగదు బదిలీ పథకం కూడా ముగిసింది. మళ్లీ పాత పద్ధతిలోనే గొర్రెలను పంపిణీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. నగదు బదిలీలో భాగంగా మునుగోడు పరిధిలో ఉన్న 4,739 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖతాల్లో అధికారులు నగదు జమ చేశారు. మరో 1,525 మంది లబ్ధిదారులకు నగదు బదిలీ చేయాల్సి ఉండగా… ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది దీంతో నగదు బదిలీకి బ్రేక్‌ పడిందని పేర్కొన్నారు.

 

అప్పటికే బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమైన లబ్ధిదారులు తమ అకౌంట్ల నుంచి డబ్బు విత్‌ డ్రా చేసుకోకుండా కూడా ఫ్రీజ్‌ చేశారు. ఎన్నిక పూర్తైన తర్వాత లబ్ధిదారులు డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పిస్తామని అధికారులు చెప్పారు. ఇప్పుడు, కేసీఆర్ సర్కారు యూటర్న్‌ తీసుకోవడంతో మునుగోడులోని లబ్ధిదారులూ నగదు విత్‌డ్రా చేసుకొనే అవకాశం లేకుండా పోయింది. ఏం కేసీఆర్ గారు ఇంకెన్ని రోజులు ప్రజలను మోసం చేస్తావు. మీరు చేసే మోసపు రాజకీయాలను ప్రజలు చూస్తూనే ఉన్నారు. రానున్న రోజుల్లో నీకు, నీ సర్కార్ కు తగిన సమాధానం చెప్పడం ఖాయమని హెచ్చరించారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news