ప్రగతి భవన్ ముందు కంచె ఉందటం పై విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంది నడిచే రోడ్డుకు కంచెలు పెట్టేకన్నా స్వంతానికి ఒక 25 కార్లు పట్టే ఇల్లు కేసీఆర్ గారు కట్టె ఆలోచన చేయనిది తప్పయి ఉండొచ్చు, ఇయ్యాల వారి దృష్టిలో, కాని అందుకు కారణం తరాల వరకు ఆ గడి తమదే అనుకొని, బహుశా… ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు కూడా అంటూ మండిపడ్డారు.
హైదరాబాద్‌లో ఉండేది, సెక్రటేరియట్‌కు వచ్చేది తక్కువగానే పాటించిన కేసీఆర్ గారికి ఇప్పుడు మాత్రం హైదరాబాద్‌ల ఉండవలసిన అవసరం ఏమిటి, అక్కడే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ల ఉండచ్చు. ఐనా 1 ఎకరం ఉన్న టీఆర్ఎస్ ఆఫీస్ కు మీరొస్తే అంత 25 కార్ల జాగ ఉంటది కదా.. ఇప్పుడు కూడా ఆఫీస్ కు రాను , అందరు నా ఇంటికి రావాలి అనే ఈ ధోరణి తప్పు, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులవారిది అని ఫైర్ అయ్యారు. ఐనా మీరు 100 మార్లు చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లకే ఇయ్యాల్టదాక దిక్కులేని తెలంగాణ ప్రజలు, మీ 25 కార్ల ఇంటి గురించి ఎందుకు ఆలోచన చెయ్యాలి, మీ బీఆర్ఎస్ ఈ అంశంపై తప్పక ఆత్మవిమర్శ చేసుకుని తీరాలన్నారు.