పోలవరం వివాదంపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

-

పోలవరం వివాదంపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి వరదలు ముంచెత్తిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన డ్యామేజీని దాచిపెట్టేందుకు కేసీఆర్ సర్కారు ప‌డ‌రాని పాట్లు ప‌డుతోంది. ప్రపంచంలోనే అద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యంగా చెప్పుకున్న రూ.లక్ష కోట్ల ఈ భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గోదావరి నీటిలో మునిగిపోయింది. ప్రాజెక్టు పంపులు, మోటార్లు వరదలో చిక్కుకున్నాయి. వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇంత పెద్ద ఫెయిల్యూర్‌ను దాచి పెట్టేందుకు టీఆర్ఎస్ సర్కారు పొలిటికల్ డైవర్షన్ ఎజెండాను ఎంచుకుంది. కాళేశ్వరం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రోజుకో కట్టుకథ అల్లుతోందని అగ్రహించారు.

ఇటీవల సీఎం, మంత్రులు చేస్తున్న వివాదాస్పద కామెంట్లన్నీ ఇందులో భాగమే… కాళేశ్వరం మోటార్లు, పంపులన్నీ మునిగిపోవడంపై జనంలో చర్చ జరిగితే… ఇప్పటివరకు చెప్పిన గొప్పలన్నీ గోదాట్లో కొట్టుకుపోతాయని అధికార పార్టీలో ఆందోళన మొద‌లైంది. అందుకే విమర్శల నుంచి తప్పించుకునేందుకు ఈ చేత‌గాని ప్ర‌భుత్వం కొత్త వివాదాలు తెరపైకి తెచ్చింది. ఈ నేపథ్యంలోనే గోదావరి పరీవాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరిగిందని… ఈ భారీ వానల వెనుక విదేశీ కుట్ర ఉండొచ్చని ఈ ద‌ద్ద‌మ్మ కేసీఆర్ ప‌నికిరాని మాట‌లు మాట్లాడారు. కాళేశ్వరం మునకను తెరమరుగు చేసేందుకు ప్లాన్ ప్రకారమే కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నరని నిప్పులు చెరిగారు.

రెండు రోజులపాటు రాజకీయ వర్గాల చర్చలన్నీ క్లౌడ్​ బరస్ట్ చుట్టే ముసురుకోవటంతో… తాము అనుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యిందనే ఆనందం టీఆర్ఎస్ వర్గాల్లో స్ప‌ష్టంగా క‌న్పించింది. మరోవైపు మంత్రి పువ్వాడ పోలవరం వివాదం తెరపైకి తెచ్చి… కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరటం వెనుక కూడా టాపిక్ డైవర్షన్ ఎత్తుగడ ఉంది. పోలవరంతోనే భద్రాచలం మునిగిందని, ఏపీ సర్కారు ఆ ప్రాజెక్టు డిజైన్‌‌ మార్చి, 3 మీటర్లు ఎత్తు పెంచడంతోనే వరద ముంచెత్తిందని పువ్వాడ వ్యాఖ్యానించారు. ఇది నేషనల్‌‌ ప్రాజెక్ట్ కాబట్టి కేంద్రం జోక్యం చేసుకొని ఎత్తు తగ్గించాలని, ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తెలంగాణకు తిరిగిచ్చేయాలని డిమాండ్‌‌ చేశారు. పువ్వాడకు కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రులు ఉమ్మడి ఏపీని అలాగే ఉంచాలని… హైదరాబాద్‌‌ను ఏపీకి ఇవ్వాలని కామెంట్ చేశారు. నిజానికి పోలవరం ప్రాజెక్టుకు టీఆర్ఎస్ మద్దతు ప‌లికింది. ఇప్పుడు అనూహ్యంగా పోలవరం వివాదాన్ని టీఆర్ఎస్​ లేవనెత్తడం కూడా… విదేశీ కుట్ర కామెంట్లలా పొలిటికల్ డైవర్షన్ ఎజెండాలో భాగమేనని పేర్కొన్నారు విజ‌య‌శాంతి.

Read more RELATED
Recommended to you

Latest news