అధికారంలోకి రాగానే “బెల్ట్” తీస్తాం: వైయస్ షర్మిల

-

ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంతోపాటు ముదిగొండ మండలంలో పర్యటించారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. ముదిగొండ మండలం మేడిపల్లిలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్టిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టు షాపులు బంద్ చేస్తామని ప్రకటించారు. గత ఎనిమిది ఏళ్లలో ఎనిమిది వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలను పట్టించుకున్న నాథుడే లేడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కమీషన్ల కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విద్యార్థులు, రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలపై ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని విమర్శించారు. రాష్ట్రం కోసం త్యాగాలు ఒకరు చేస్తే.. భోగాలు మరొకరు అనుభవిస్తున్నారని కేసీఆర్ కుటుంబం పై నిప్పులు చెరిగారు. మరోవైపు మంత్రి పువ్వాడ అజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు వైఎస్ఆర్టిపీ శ్రేణులు. శుక్రవారం పువ్వాడ అజయ్, షర్మిలపై చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్టిపి శ్రేణులు భగ్గుమన్నాయి. పలుచోట్ల రాస్తారోకోలు నిర్వహించి మంత్రి అజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news