దసరా పండుగ ఎఫెక్ట్.. రూ.1100 కోట్ల మందు తాగేశారు

-

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం రోజున దసరా పండుగ చాలా ఉత్సాహంగా జరిగింది. అయితే దసరా పండుగ నేపథ్యంలో… తెలంగాణలో విపరీతంగా మద్యం అమ్మకాలు జరిగాయి. తెలంగాణలో దసరా పండుగను పురస్కరించుకొని, రాష్ట్రవ్యాప్తంగా గత ఏడు రోజులలో ఏకంగా 1100 కోట్ల మీరా మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ మేరకు లెక్కలతో సహా బయటపెట్టారు అధికారులు. అక్టోబర్ రెండో తేదీ మరియు అక్టోబర్ 5వ తేదీన రెండు రోజులు మద్యం డిపోలకు సెలవులు ఉండగా, గత ఏడు పని దినాలలో 1100 కోట్లు విలువైన మద్యం విక్రమించారు. సెప్టెంబర్ 30వ తేదీన రికార్డు స్థాయిలో 313 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆ జిల్లాలో ఒకేరోజు 500 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news