YSRTP అధినేత్రి వైయస్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం జిల్లాలోని తనికెళ్ళ గ్రామంలో పర్యటిస్తున్న ఆమె సొమ్మసిల్లి పడిపోయారు.
షర్మిలకు వడదెబ్బ తగిలిందని పార్టీ నేతలు తెలిపారు. తనికెళ్ల గ్రామంలో దెబ్బతిన్న పంటలను ఆమె ఈరోజు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతుండగా సొమ్మసిల్లి పడిపోయారు. కాగా, అంతకు ముందు కేసీఆర్ సర్కార్ కీలక వ్యాఖ్యలు చేశారు షర్మిల. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే వచ్చే సంతోషమే వేరు.. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నెల్లుట్ల గ్రామ పరిధిలో సుమారు 800 కుటుంబాలు చంటిపిల్లలతో చీకట్లో బతికేవారు.
నాడు పాదయాత్రలో ఆ కుటుంబాలకు ఇచ్చిన మాట ప్రకారం సోలార్ విద్యు త్తు ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు షర్మిల. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు నేడు వెళ్తుండగా మార్గమధ్యలో వారు కలిసి ఆత్మీయంగా పలక రించి మాట్లాడారు. ఎవరూ పట్టించుకోని మా పేదల గుడిసెల్లో వెలుగులు నింపావంటూ భావోద్వేగం తో వాళ్లు ఆశీర్వదించడం సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు.
అయ్మో.. కండ్లు తిరిగి కింద పడిపోయిన వైఎస్ షర్మిల..! pic.twitter.com/e1ZhkMMafl
— News Line Telugu (@NewsLineTelugu) April 30, 2023