CCLలో దుమ్మురేపిన అక్కినేని అఖిల్.. కేరళపై తెలుగు వారియర్స్ విజయం

-

సినిమాల్లో కంటే, CCLలో దుమ్మురేపాడు అక్కినేని అఖిల్. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ షురూ అయింది. నిన్న జరిగిన మ్యాచ్ లో తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్ పై అద్భుత విజయం సాధించింది.ఈ మ్యాచ్ లో అక్కినేని అఖిల్ రెచ్చిపోయారు. కేవలం 30 బంతుల్లోనే 91 పరుగులు చేసి ఔరా అనిపించారు.

 

మొదట బ్యాటింగుకు దిగిన టాలీవుడ్ స్టార్స్ 10ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. యువ హీరో ఫ్రెండ్స్ 23 బంతుల్లో 45 పరుగులు చేశారు. హీరో సుధీర్ బాబు 2 బంతుల్లో 2 పరుగులు, అశ్విన్ బాబు 6 బంతుల్లో 15 పరుగులు చేశారు. అనంతరం లక్ష్య చేతన దిగిన కేరళ స్టార్స్ 10 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 98 పరుగులు మాత్రమే చేశారు. హీరో ప్రిన్స్ నాలుగు వికెట్లు తీయగా, నందకిషోర్ ఒక వికెట్ తీశారు. అత్యధిక పరుగులు చేసినందుకు అఖిల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version