మండుతున్న తెలంగాణం.. పెరిగిన ఉష్ణోగ్రతలు..

-

దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. పలు రాష్ట్రాల్లో సమ్మర్‌ హీట్‌తో జనం అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే వణికిపోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎండ‌లు దంచికొడుతున్నాయి. మ‌రోసారి ఉష్ణోగ్ర‌త‌లు భారీగా పెరిగాయి. ఎండ‌లు దంచికొట్ట‌డం, ఉష్ణోగ్ర‌త‌లు భారీ పెర‌గ‌డంతో ఉక్క‌పోత‌కు గుర‌వుతున్నారు ప్ర‌జ‌లు. శ‌నివారం రోజు హైద‌రాబాద్‌లో అత్య‌ధికంగా 40 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదైన‌ట్లు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది.

రాష్ట్ర వ్యాప్తంగా ప‌రిశీలిస్తే ఆదిలాబాద్ జిల్లాలో 43.3 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లాలో 42.4, రామ‌గుండంలో 41.4, హ‌నుమ‌కొండ‌లో 41, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 40.9 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. నగరంలో ఎండలు మండుతున్న నేపథ్యంలో వడదెబ్బకు వృద్ధులు విలవిలలాడుతున్నారు. వడదెబ్బ తగిలి మృతి చెందుతున్న ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పని ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దని, తప్పనిసరై వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news