ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి వద్ద టెన్షన్ టెన్షన్

-

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది.ఆయన ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ కేడర్ సిద్ధమవుతుందని సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు.ఆయన ఇంటి చుట్టుపక్కల ఎక్కడిక్కడ బారీకేడ్లను ఏర్పాటుచేశారు. 100మంది పోలీసులతో ఆ ప్రాంతం మొత్తం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. కాగా, కౌశిక్ రెడ్డి, అరికెపూడి వ్యవహారం గత 5 రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం..ఆ తర్వాత అరికెపూడి గాంధీకి సవాల్ విసరడంతో తన అనుచరులతో కౌశిక్ ఇంటికి వెళ్లిన గాంధీ ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే కొందరు కౌశిక్ ఇంటిపై రాళ్ల దాడి చేయడంతో పరిస్థితి ఉద్రక్తంగా మారింది. దీంతో పోలీసులు అరికపూడితో పాటు ఆయన 30 మంది ఆయన అనుచరులను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పీఎస్‌కు తరలించారు. అనంతరం కౌశిక్ రెడ్డికి మద్దతుగా హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతలంతా సీపీ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Latest news