వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత.. పాదయాత్ర బస్సు పై టిఆర్ఎస్ శ్రేణుల దాడి

-

వరంగల్ జిల్లా నర్సంపేటలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 223వ రోజు కొనసాగుతోంది. అయితే ఆదివారం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై వైయస్ షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే నేడు షర్మిల పాదయాత్రను టిఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటారనే ప్రచారం ఉదయం నుంచే సాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అయినప్పటికీ టిఆర్ఎస్ కార్యకర్తలు వైయస్ షర్మిల పాదయాత్ర ని అడ్డుకున్నారు.

దీంతో పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లింగగిరి గ్రామంలో పాదయాత్ర బస్సు పై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారు. కిరోసిన్ పోసి బస్సును కాల్చే ప్రయత్నం చేశారు టిఆర్ఎస్ కార్యకర్తలు. మంటలు వ్యాపిస్తుండగా ఆ మంటలను వైటిపి కార్యకర్తలు ఆర్పేశారు. అనంతరం టిఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్ర వాహనాలపై రాళ్లూరువారు. షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో షర్మిల పాదయాత్ర ఉద్రిక్తతల నడుము కొనసాగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version