మయన్మార్ లో ఉద్రిక్తలు నెలకొంటున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. భారత్ మయన్మార్ మధ్య ఉన్న ఫ్రీ మూమెంట్ చేస్తున్నట్లు చెప్పింది. ఈ మేరకు హోం మంత్రి అమిత్ షా గురువారం ఒక ప్రకటనని విడుదల చేశారు. దేశ సరిహద్దుల్ని సురక్షితంగా ఉంచాలని మోడీ ఆదేశాల మేరకు భారత్ మైన్మార్ ఫ్రీ మూమెంట్ రిజైన్ ని రద్దు చేస్తున్నాం అని చెప్పారు. దేశాంతర్గత భద్రత దృశ్య ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తక్షణమే దీనిని అమల్లోకి తీసుకొస్తున్నామని అన్నారు ఎక్స్ లో ఈ విధంగా ఆయన పోస్ట్ చేశారు. మయన్మార్ సరిహద్దు వెంబడి 1643 కిలోమీటర్ల మేర కంచె వేస్తామని ప్రకటించిన అమిత్ షా తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తెగల కారణంగా మణిపూర్ లో అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే మిజోరం మాత్రం ఎఫ్ ఎం ఆర్ ని తొలగింపు చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పింది.