జమ్మూ కాశ్మీర్ లోని రాజోలి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ సైనిక శిబిరం సమీపంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు రక్షణశాఖ అధికారులు తెలిపారు. గుర్తుతెలియని ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఆర్మీ క్యాంపుపై రాళ్లూ రువ్వారు.
పౌరుల హత్యలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిని దిగ్బంధించారు. అయితే ప్రస్తుతం పట్టణంలో పరిస్థితి ఉదృతంగా ఉన్నప్పటికీ.. అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. మృతులను రాజూరికి చెందిన కమల్ కుమార్, సురేందర్ కుమార్ గా గుర్తించారు. గాయపడిన మరో వ్యక్తిని ఉత్తరాఖండ్ కి చెందిన అనిల్ కుమార్ గా గుర్తించారు. అతడిని ఆర్మీ ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు.