కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మరోసారి ఎలాన్ మస్క్, టెస్లా కంపెనీపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో టెస్లా కార్లను ఇండియాలోనే తయారు చేయాలని ఎలాన్ మస్క్ కు నితిన్ గడ్కరీ సూచించారు. కానీ టెస్లా మాత్రం వేరే దేశాల్లో తయారు చేసిన తమ కార్లను ఇండియాలో అమ్మేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాలో తయారు చేసిన వాహనాలను ఇండియాలో అమ్ముతామంటే సమస్యే అని ఆయన అన్నారు. టెస్లా భారత్ లో వాహనాలను ఉత్పత్తి చేస్తే ఆ సంస్థకు ప్రయోజనం ఉంటుందని వెల్లడించారు.
దేశంలో పెట్రోల్ వాహనాల కన్నా చవకగా ఎలక్ట్రిక్ వాహనాలు లభించే రోజులు ఎంతో దూరంలో లేవని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశంలో పెట్రోల్, డిజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. దీంతో పాటు బయో ఇథనాల్, సీఎన్జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు ఉత్పత్తి చేస్తున్న సంస్థలకు రుణాలిచ్చి ప్రాధాన్యం కల్పించాలన్నారు నితిన్ గడ్కరీ.