తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరోసారి టెట్

-

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసి టీచ‌ర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్య‌ర్థుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపిక‌బురు అందించింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భర్తీ చేసేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహించాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది.చివరిసారిగా గతేడాది జూన్‌ 12న విద్యాశాఖ టెట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే.

ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం డీఎడ్‌, బీఎడ్‌ పాసైన వారు టెట్‌లో ఉత్తీర్ణులైతేనే ఉపాధ్యాయుల నియామకానికి నిర్వహించే టీఆర్‌టీ పరీక్ష రాయడానికి అర్హులవుతారు. టెట్‌లో వచ్చిన మార్కులకు టీఆర్‌టీ ర్యాంకింగ్‌లో 20 శాతం వెయిటేజీ ఉన్నందున టెట్‌లో అత్యధిక మార్కులు దక్కించుకోవడానికి అభ్యర్థులు పోటీపడుతుంటారు. టెట్ లో అర్హత లేకపోతే ఈ పరీక్షలకు హాజరుకాలేరు.పైగా టెట్ ఉత్తీర్ణత లేకపోతే ప్రైవేటు పాఠశాలల్లో కూడా బోధన చేయడానికి వీలుండదు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version