సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ 100వ సినిమాలో దళపతి విజయ్

-

దళపతి విజయ్ వరుస సినిమాలు చేస్తున్నారు. మాస్టర్, బీస్ట్ చిత్రాల విజయంతో ఊపు మీదున్న విజయ్ తదుపరి తన సినిమాలను వేగంగా చేస్తున్నారు. త్వరలోనే ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే  ‘వారిసు'(వారసుడు) చిత్రంతో బిజీగా ఉన్న విజయ్‌.. ఇది పూర్తికాకముందే ఆయన మరో కొత్త సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్​ బయటకు వచ్చింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ 100వ చిత్రంలో విజయ్‌ హీరోగా నటించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధినేత ఆర్‌. బి. చౌదరి తనయుడు, నటుడు జీవా మీడియా సమావేశంలో తెలిపారు. తన తండ్రిని విజయ్‌ కొన్ని రోజుల క్రితం కలిసి, తమ నిర్మాణ సంస్థకు ప్రత్యేకంగా నిలవనున్న 100వ సినిమాలో హీరోగా నటించేందుకు సుముఖత వ్యక్తం చేశారని జీవా వెల్లడించారు. తనకూ సినిమాలో నటించే అవకాశం ఇవ్వాలని, రెమ్యూనరేషన్‌ తీసుకోనని తన తండ్రికి చెప్పినట్టు వివరించారు ఈ ఇద్దరు కలిసి గతంలో స్నేహితుడు అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మరి, ఈ కొత్త చిత్రానికి దర్శకుడెవరు? వెంటనే ఈ సినిమా పట్టాలెక్కుతుందా? తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news