సెలబ్రీటీలు కూడా మనుషులే..తప్పుడు వార్తలు రాయకండి – తమ్మారెడ్డి

-

సెలబ్రీటీలు కూడా మనుషులే..తప్పుడు వార్తలు రాయకండని టాలీవుడ్‌ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వార్తలు ఇబ్బందికరంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ కుటుంబాలుంటాయి.. సెలబ్రీటీలు కూడా మనుషులేనని ఆవేదన వ్యక్తం చేశారు తమ్మారెడ్డి.

సభ్యతగా ఉండటం అందరికీ అవసరమని… వ్యూస్ కోసం నెగిటివ్ ప్రచారాలు , చులకన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వ్యవస్ద వ్యక్తుల చేతికి వెళ్లిన పరిస్దితి ఉందని.. సినిమా టికెట్ రేట్ల పై నిర్మాతల ఎవరిష్టం వచ్చి మాట్లాడుతున్నారన్నారు.

ప్రభుత్వాలతో సినిమా టికెట్ లకు ప్లెక్సిబుల్ రేట్లు ఉండాలని అడిగితే బావుండేది..డిమాండ్ కు తగ్గట్టు రేట్లు పెట్టాలని తెలిపారు. గతంలోలా‌ అందరూ కూర్చోని మాట్లాడుకోవాలని.. సోషల్ మీడియా సైతం కట్టుబాటు ఉండాలని చెప్పారు. కంటెంట్ మీద విమర్శ మంచిదే..‌ వ్యక్తిగతంగా విమర్శలు వద్దని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news