బుచ్చి బాబు పై ఆ హీరోకు నమ్మకం లేదా..!!

-

ఉప్పెన సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సాన. ఆ సినిమా తో ఆయన వంద కోట్ల క్లబ్ లో కూడా అడుగుపెట్టాడు. కాని తర్వాత సినిమా ఏది కూడా మొదలు కాలేదు. చాలా రోజులుగా  ఎన్టీఆర్ చూట్టూ తిరిగిగాడు.  కానీ అనూహ్యంగా ఇప్పుడు రామ్‌ చరణ్ సినిమా ఉందని అధికారిక ప్రకటన వచ్చింది. దీనితో చాలా రోజుల నుండి వెయిట్ చేస్తూ వస్తున్న బుచ్చి బాబు కూడా సినిమా ఓకే కావడంతో ఆనందంగా ఉన్నాడు.

ఇక ఈ సినిమా ఓకే అవ్వడానికి వెనక ఏమి కారణం వుంటుందా అని చాలా మంది చాలా రకాలు గా వ్యాఖ్యానిస్తున్నారు. బుచ్చి బాబు చాలా రోజులగా కథ తయారు చేసుకొని జూ ఎన్టీఆర్ కు వినిపించినా అతను కథలో మార్పులు కావాలని కోరాడట. బుచ్చి బాబు పట్టువదల కుండా మళ్లీ చెప్పే సరికి పాన్ ఇండియా రేంజ్ కావాలని కోరాడట. ఇక జూ ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత వచ్చే సినిమాలు అన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్ తోనే చేయాలని పట్టుదల తో ఉన్నాడట.

ఇక బుచ్చి బాబు తన గురువైన సుకుమార్ గారి సహాయంతో హీరో రామ్ చరణ్ ను కలిసి స్క్రిప్ట్ ఓకే చేపించుకున్నట్లు తెలుస్తోంది.శంకర్ మూవీ పూర్తి అయిన వెంటనే  బుచ్చి బాబుతో రామ్‌ చరణ్ సినిమాను చేసేందుకు రెడీ అవుతాడు. అధికారిక ప్రకటన మీద బుచ్చిబాబు కూడా ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేశాడు.’కొన్ని సార్లు తిరుగుబాటు తప్పనిసరి అవుతుంది. రామ్ చరణ్ సార్ తో నా తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటిస్తున్నందుకు చాలా విలువైన అవకాశం నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చరణ్ సార్ అని పోస్ట్ పెట్టారు.

 

Read more RELATED
Recommended to you

Latest news