సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు . ఇక ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకొని వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును చాటుకున్నారు సాయిధరమ్ తేజ్. ఇక ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న ఈయన గత ఏడాది సెప్టెంబర్ నెలలో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే . ఇక అక్కడే నెల రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత బయటకు వచ్చి పెద్దగా ఎక్కడా కనిపించలేదు. అయితే నిన్న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన మెగా కార్నివాల్ లో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు.
ఆయన మాట్లాడుతూ.. ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతానని అసలు ఊహించలేదు అంటూ ఎమోషనల్ కామెంట్ చేశారు. మామయ్య పుట్టినరోజు అంటే పెద్ద పండుగని.. చిన్నప్పటినుంచి ఈరోజు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసేవాళ్ళం అని ఆయన తెలిపారు. ఇకపోతే సాయి ధరంతేజ్ ను అందరూ సుప్రీం హీరో అని పిలవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే సాయిధరమ్ తేజ్ ఈ బిరుదు పై మాట్లాడుతూ.. తన పేరు ముందు సుప్రీం అని ఉండడం తాను ఒక బిరుదుగా భావించడం లేదని, అదొక సెంటిమెంటు అని చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను ఎంత ఎదిగినా.. ఎన్ని హిట్లు, ప్లాప్ లు వచ్చినా సరే ఈ పేరు మాత్రం తనకు శ్రీరామరక్షగా ఉంటుందని సాయి ధరమ్ తేజ్ వెల్లడించడం జరిగింది.
ఇకపోతే ఈ బిరుదు ముందుగా మెగాస్టార్ చిరంజీవికి సుప్రీమ్ అని ఉండేది. ఇక ఈ క్రమంలోనే అదే బిరుదును సాయిధరమ్ తేజ్ కి రావడంతో ఆ పేరును తన సెంటిమెంట్ గా భావిస్తున్నానని వెల్లడించారు సాయి ధరంతేజ్.