బెంగాల్ ప్రజల మధ్య విద్వేషాలను రగిల్చేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది: మమతా బెనర్జీ

-

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పశ్చిమబెంగాల్లో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లను బిజెపి లేవనెత్తుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. నార్త్ బెంగాల్, గూర్ఖాలాండ్ అంటూ బిజెపి ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. రాష్ట్ర విభజన ప్రయత్నాలను తాను అడ్డుకుంటానని.. అవసరమైతే తన రక్తాన్ని సైతం చిందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

దశాబ్దాలుగా బెంగాల్ ప్రజలంతా సామరస్యంతో జీవిస్తున్నారని.. వీరి మధ్య విద్వేషాలు రగిల్చేందుకు బీజేపీ యత్నిస్తోందని అన్నారు. మరోవైపు ప్రత్యేక కాంతాపూర్ ను వ్యతిరేకిస్తే మమతా బెనర్జీ రక్తాన్ని కళ్ల చూస్తామని కాంతాపూర్ లిబరేషన్ సంస్థ నేత జీవన్ సింగ్లా హెచ్చరించారు.ఈ హెచ్చరికలపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. అలాంటి బెదిరింపులు తనను ఏమీ చేయలేవని అన్నారు. అలాంటి వాటిని లెక్క చేయనని, అలాంటి బెదిరింపులకు భయపడను అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news