ఈ ఫోటోలో కనిపించే కారుకు పెట్రోల్, డీజిల్ అవసరం లేదట..మరీ?

-

మాములుగా వాహానాలు అన్నీ పెట్రోల్, లేదా డీజిల్ తో నడుస్తాయి..ఈ మధ్య విద్యుత్ వాహనాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.పెరుగుతున్న ఇంధన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మంది ఎలెక్త్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో వీటికి మార్కెట్ లో డిమాండ్ కూడా భారీగా పెరిగి పోయాయి.అంతేకాదు ఇవి పేలి పోతున్నాయి.అందుకే ఇండోనేసియా కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ ఎక్కువగా ఉత్పత్తయ్యే పామాయిల్‌ తోనే ఇంధన సమస్యకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే డీజిల్‌లో పామాయిల్ కలుపుతుండగా.. దానిని మరింతగా పెంచింది. ఏకంగా 40శాతం పామాయిల్ కలపాలని నిర్ణయించింది. దీనిపై బుధవారం నుంచి ప్రయోగాలను ప్రారంభించింది..

పామాయిల్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఇండోనేసియా మొదటి స్థానంలో ఉంది. అక్కడ ఆయిల్ పామ్‌ తోటలు పెద్ద మొత్తంలో ఉంటాయి. మనదేశం కూడా చాలా వరకు పామాయిల్‌ను ఇక్కడి నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఈ పామాయిల్ తోటలు, ఫ్యాక్టరీలతో ఇండోనేసియాలో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఈ దేశ ఆదాయంలో కూడా దీని వాటే ఎక్కువగా ఉంది. ఐతే పామాయిల్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. చమురు నిల్వలు మాత్రం ఇండోనేసియాలో లేవు. అందుకు గల్ఫ్ దేశాలతో పాటు యూరప్ దేశాల నుంచి పెద్ద మొత్తంలో ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది…ఈ ఖర్చును తగ్గించుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది..

ఎన్నో దేశాల్లో డీజిల్‌లకు ప్రత్యామ్నాయంగా బయోడీజిల్‌ను వినియోగిస్తున్నారు. బయోడీజిల్‌ వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. వాహనాల ఇంజిన్ సామర్థ్యం కూడా పెరుగుతుంది. తద్వారా మైలేజీ ఎక్కువగా వస్తుంది. దీనితో ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణానికి కూడా పెద్దగా హాని జరగదు. ఈ క్రమంలోనే ఎన్నో దేశాలు బయో డీజిల్‌ వాడకపై దృష్టిస్తాయి. ఈ క్రమంలో పామాయిల్‌నే బయో డీజిల్‌గా వినియోగించాలని ఇండోనేషియా ప్రభుత్వం నిర్ణయించింది. డీజిల్‌లో 30 శాతం పామాయిల్ కలపాలని చమురు ఉత్పత్తి సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ డీజిల్‌ను 12 ప్యాసింజర్ కార్లు, కమర్షియల్ వాహనాలపై ఈ ప్రయోగాన్ని అమలు చేసి ఫలితాలను పరీక్షిస్తోంది. బుధవారం నుంచే పామాయిల్ బయో డీజిల్ వాహనాలను తిప్పడం ప్రారంభించారు. ట్రయల్ రన్ తర్వాత ఇంజిన్ పనితీరు, టార్క్, ఇంధన వినియోగం, కర్భన ఉద్గార వివరాలను పరిశీలిస్తారు.. దాన్ని బట్టి వాహనాల వాడుకను ఈ ఏడాదిలోగా ప్రకటించనున్నట్లు ఇండోనేషియా ప్రభుత్వం పేర్కొంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version