కరోనా వ్యాక్సిన్ సరఫరా పై చేతులెత్తేసింది కేంద్రం. సొంతంగా కరోనా వ్యాక్సిన్ కొనుగోలు చేసుకోవాలని తేల్చి చెప్పారు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ. సొంతంగా కొనుగోలు చేసుకోవాలని రాష్ట్రాలకు సలహా ఇచ్చారు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ.

కొవిడ్ సంసిద్ధతపై అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ. ఈ సందర్భంగా వ్యాక్సిన్ సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణతో పాటు వ్యాక్సిన్ సరఫరా చేయలంటూ ఇతర రాష్ట్రాల వినతి ఇచ్చారు. బయోలజికల్ ఇ సహకారంతో 15 లక్షల డోసులు సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.