ఆన్‌లైన్‌లో ఒక వస్తువును బుక్ చేస్తే మరొక వస్తువు వస్తుంది. చిన్న వస్తువులు అయితే ఏమి పర్వాలేదులే అనుకోవచ్చు. కానీ ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో కూడా ఇలాగే జరుగుతుంటుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్‌లు కొనుగోలు చేసిన సమయంలో కొందరికీ ఫోన్‌లకు బదులు ఇటుకలు, రాళ్లు, సోపులు వస్తుంటాయి. తాజాగా ఇంగ్లాండ్‌కు చెందిన ఓ మహిళ ఐఫోన్ 13 ప్రో మొబైల్‌ను కొనుగోలు చేసింది. ఈ మొబైల్ డెలివరీ కోసం అదనంగా డబ్బులు కూడా చెల్లించింది.
అదనంగా డబ్బులు చెల్లించడంతో పాటు మరుసటి రోజే పార్సిల్ రావాల్సి ఉన్నా.. మూడు రోజుల తరువాత వచ్చిన ఆ పార్సిల్‌ను విప్పి చేసి ఆ మహిళ షాక్ గురైంది. ఐఫోన్ 13 ప్రో స్థానంలో ఆమెకు సోప్ బాక్స్ వచ్చింది. వెంటనే తాను బుక్ చేసుకున్న స్కై మొబైల్ ప్లాట్‌ఫామ్ కు ఫోన్ చేసింది. కానీ ఎవ్వరూ రెస్పాండ్ కాలేదని వాపోయింది. మొబైల్ ధర రూ.150 పౌండ్లు అని మొబైల్ స్థానంలో ఇలా తనకు సోప్ బాటిల్ పంపారు అని వాపోయింది బాధితురాలు.