పారిశ్రామిక అభివృద్ధికి ‘ట్రిపుల్ ఐ మంత్ర’: కేటీఆర్

-

రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తల పాత్ర ఎంతో కీలకంగా ఉందన్నారు. కాగా, సోమవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు.

మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోటీ పడి రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకొచ్చామన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో ‘ట్రిపుల్ ఐ మంత్ర’ పాత్ర ఎంతో కీలకమన్నారు. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్.. ఇవి మా నినాదాలని పేర్కొన్నారు. తెలంగాణను పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా టీఎస్ ఐపాస్ గురించే మాట్లాడుతున్నారని అన్నారు.

పరిశ్రమల అనుమతి ఇవ్వడంలో జాప్యం చేస్తే జరిమానా విధించే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త పథకాలు అమలు చేయడం కాదని, ఉన్న పథకాలను మరింత మెరుగుగా అమలు చేయడమన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్లు ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్రం అభివృద్ధి సాధిస్తేనే.. దేశం ఆర్థిక పురోగతి సాధిస్తుందన్నారు. ఉత్పత్తి రంగంలో కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news